సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ అమ్మవారికి వైభవంగా ఘటోత్సవాలు

by Ajay Maddhiboyina |

సికింద్రాబాద్ ఉజ్జ‌యిని మ‌హంకాళీ అమ్మవారికి వైభ‌వంగా ఘ‌టోత్స‌వాల‌ను నిర్వ‌హించారు. మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ ప్ర‌త్యేక పూజ‌లు చేసి ఘ‌టోత్స‌వాల‌ను ప్రారంభించారు.

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ అమ్మవారికి వైభవంగా ఘటోత్సవాలు
X

దిశ‌, వెబ్ డెస్క్: సికింద్రాబాద్ ఉజ్జ‌యిని మ‌హంకాళీ అమ్మవారికి వైభ‌వంగా ఘ‌టోత్స‌వాల‌ను నిర్వ‌హించారు. మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ ప్ర‌త్యేక పూజ‌లు చేసి ఘ‌టోత్స‌వాల‌ను ప్రారంభించారు. అనంతరం మంత్రి పోతురాజులతో కలిసి డ్యాన్స్ చేశారు. బోనాల జాత‌ర‌కు 15 రోజులు ముందుగా ఘ‌టాల ఎదుర్కోలు నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. ఘటాల ఎదుర్కోలుతోనే బోనాల ఉత్సవాలు ప్రారంభమైనట్టు భావిస్తున్నారు. సాయంత్రం 7 గంటలకు ముస్తాబైన ఘటాన్ని ఆలయానికి తీసుకువస్తారు. సోమవారం నుండి జూలై 11 వరకు ఆయా ప్రాంతాల్లో అమ్మావారి భక్తులకు దర్శనం ఇస్తారు. 12న బోనం, 13వ తేదీన రంగం అదేవిధంగా 14న రంగం అనంతరం భవిష్యవాణి తరవాత అంబారీ ఊరేగింపుతో ఘటాన్ని మెట్టుగూడలోని అమ్మవారి ఆలయానికి సాగనంపుతారు.

Next Story