Good news: భక్తులకు గుడ్‌న్యూస్.. సికింద్రాబాద్ - తిరుపతి వందే భారత్ 20 బోగీలకు పెంపు..!

by Ramesh Naini |

హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే రైల్వే ప్రయాణికులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుడ్‌న్యూస్ చెప్పారు.

Good news: భక్తులకు గుడ్‌న్యూస్.. సికింద్రాబాద్ - తిరుపతి వందే భారత్ 20 బోగీలకు పెంపు..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ నుంచి తిరుపతి (Secunderabad – Tirupati) వెళ్లే రైల్వే ప్రయాణికులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) గుడ్‌న్యూస్ చెప్పారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఎక్స్ వేదికగా తెలిపారు. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతికి పెరుగుతున్న భక్తుల ప్రయాణ అవసరాల దృష్ట్యా.. సికింద్రాబాద్ – తిరుపతి (Vande Bharat) వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలను 16 నుంచి 20 బోగీలకు అప్‌గ్రేడ్ చేసేందుకు రైల్వే శాఖ అంగీకరించిందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ 2023 ఏప్రిల్‌లో సికింద్రాబాద్ - తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించారు. అప్పటి నుంచి శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుపతి వెళ్లే భక్తులకు వందే భారత్.. ఆధునిక, సౌకర్యవంతమైన రైలు ప్రయాణానికి ప్రతీకగా నిలిచిందన్నారు. ఈ క్రమంలో పెరుగుతున్న భక్తుల ఆదరణను గుర్తించి నా విజ్ఞప్తి మేరకు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వందే భారత్ బోగీలను 16 నుంచి 20 బోగీలకు పెంచడానికి అంగీకరించారని వివరించారు. దీంతో తిరుపతి వెళ్లే భక్తులందరికీ రైలు ప్రయాణం మరింత సౌకర్యవంతం, వేగవంతం కానుందని కిషన్ రెడ్డి ట్వీట్‌లో వెల్లడించారు. కాగా, రైలు నంబర్ 20701/20702 సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో 16 నుంచి 20కి పెంచనున్నారు.

Next Story