వచ్చే ఏడాదిలోగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సిద్ధం : కిషన్ రెడ్డి

by Muthe.Rajitha |

వచ్చే ఏడాదిలోగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సుందరీకరణ పనులు పూర్తవుతాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

వచ్చే ఏడాదిలోగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సిద్ధం : కిషన్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : వచ్చే ఏడాదిలోగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సుందరీకరణ పనులు పూర్తవుతాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం హైటెక్‌సిటీ రైల్వే స్టేషన్‌ను అధికారులతో కలిసి పరిశీలించిన కిషన్ రెడ్డి.. ప్రస్తుతం హైదరాబాద్‌లోని అన్ని రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పనులు వేగంగా చేస్తున్నట్టు తెలిపారు. సికింద్రాబాద్ స్టేషన్‌ కు సమానంగా హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌ ను కూడా ఆధునిక సౌకర్యాలతో రూపుదిద్దుతున్నామని అన్నారు.

మొత్తం రూ.35 కోట్లతో రెండు విడతలుగా ఈ పనులు కొనసాగుతున్నాయని, మొదటి విడత వచ్చే ఫిబ్రవరిలోపు పూర్తవుతుందని చెప్పారు. సంక్రాంతి సందర్భంగా 16 ప్రత్యేక రైళ్లు ఈ స్టేషన్‌లో ఆగేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా వెల్లడించారు. వచ్చే ఏడాదికి దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు మరింత మెరుగైన, ఆధునిక రైల్వే సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి కిషన్ రెడ్డి తెలియజేశారు.

Next Story