- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సికింద్రాబాద్ రైల్వే యాన్యువల్ రిపోర్ట్ రిలీజ్
by Prasad Jukanti |
సికింద్రాబాద్ రైల్వే పోలీస్ వార్షిక రిపోర్ట్ ను ఎస్పీ చందనా దీప్తి విడుదల చేశారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: సికింద్రాబాద్ రైల్వే పోలీస్ (Secunderabad Railway Police) పరిధిలో ఈ ఏడాది నేరాల సంఖ్య తగ్గిందని సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ చందనాదీప్తి(SP Chandanadeepti) వెల్లడించారు. ఈ ఏడాది 2,607 కేసులు నమోదైనట్లు తెలిపారు. ఇవాళ వార్షిక నివేదికను ఆమె విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఏడాది 500 మంది చిన్నారులను రక్షించామని, ఈ ఏడాది మొత్తం 1,317 మంది చనిపోయారని తెలిపారు. ఆత్మహత్యలు జరిగే ప్రాంతాల్లో ఫెన్సింగ్ ఏర్పాటు చేశామన్నారు. 810 కిలోల గంజాయి సీజ్ చేశామని ఎన్‍పీడీఎస్ చట్టం కింద 54 కేసులు నమోదు చేసి 70 మందిని అరెస్టు చేశామన్నారు. ఈ ఏడాది 1,322 ఫోన్లు రికవరీ చేశామన్నారు. 12.25 కోట్ల విలువైన డ్రగ్స్ ను జీఆర్పీ ద్వారా స్వాధీనం చేసుకున్నామన్నారు.
Next Story






