బిగ్ బ్రేకింగ్: TSPSC కార్యాలయ పరిసరాల్లో 144 సెక్షన్

by Disha Web Desk 19 |
బిగ్ బ్రేకింగ్: TSPSC కార్యాలయ పరిసరాల్లో 144 సెక్షన్
X

దిశ, వెబ్‌డెస్క్: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఘటన రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోంది. పేపర్ లీక్ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు టీఎస్పీఎస్సీ కార్యాలయ ముట్టడికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కమిషనరేట్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌లోని టీఎస్పీఎస్సీ ప్రధాన కార్యాలయం పరిసరాల్లో ఆంక్షలు విధించడంతో పాటు 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. టీఎస్పీఎస్సీ కార్యాలయం పరిసరాల్లో ఐదుగురికి మించి గుమిగూడొద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. టీఎస్పీఎస్సీ కార్యాలయ పరిసరాల్లో ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని అందరూ గమనించాలని సూచించారు.

Next Story