సెక్రటేరియట్‌లో అధికారుల సంఖ్య పెంచండి.. సీఎస్‌కు ఉద్యోగుల రిక్వెస్ట్

by Bhoopathi Nagaiah |

తెలంగాణ సెక్రటేరియట్‌లో ఉద్యోగుల సంఖ్య పెంచాలని సచివాలయ ఆఫీసర్స్ అసోసియేషన్ సీఎస్‌ రామకృష్ణారావును రిక్వెస్ట్ చేసింది.

సెక్రటేరియట్‌లో అధికారుల సంఖ్య పెంచండి.. సీఎస్‌కు ఉద్యోగుల రిక్వెస్ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర సచివాలయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా అధికారుల సంఖ్యను పెంచాలని చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావును తెలంగాణ సచివాలయ ఆఫీసర్స్ అసోసియేషన్ కోరింది. శుక్రవారం తెలంగాణ సచివాలయ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గంధం సురేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, కోశాధికారి శ్యాంసుందర్ ఆధ్వర్యంలో ఆఫీసర్స్ అసోసియేషన్ 2026 డైరీని సీఎస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు గంధం సురేష్ కుమార్ మాట్లాడుతూ.. డిప్యూటీ సెక్రటరీ, ఆ పై స్థాయి అధికారులందరికీ చాంబర్స్ కేటాయించాలని కోరారు. అలాగే అధికారుల సంఖ్యను పెంచాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. దానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సానుకూలంగా స్పందించి తగిన ఆదేశాలు ఇచ్చారు.

Next Story