Telangana Secretariat: వచ్చే నెల 4న సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికలు

by Gantepaka Srikanth |

సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికల జనవరి 4న నిర్వహించాలని నిర్ణయించారు.

Telangana Secretariat: వచ్చే నెల 4న సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికల జనవరి 4న నిర్వహించాలని నిర్ణయించారు. గత వారం తెలంగాణ సచివాలయ సంఘం ఆధ్వర్యంలో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం గురువారం తెలంగాణ సచివాలయ సంఘం సమావేశం సంఘం అధ్యక్షుడు నరేందర్ రావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జనరల్ బాడీలో తీసుకుని నిర్ణయాలను చర్చించి.. తెలంగాణ సచివాలయ సంఘాన్ని డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ సంఘంగా పేరు మార్చారు.

అదే విధంగా ప్రత్యక్ష ఎన్నికల కోసం చేపట్టిన బైలాస్ సవరణను జనరల్ బాడీ సమావేశంలో ఆమోదించినందున ఆ ప్రకారం బైలాస్ రిజిస్ట్రేషన్ చేయించాలని నిర్ణయించారు. వచ్చే జనవరి 4వ తేదీన డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ సంఘానికి ఎన్నికల నిర్వహించడానికి సమావేశం నిర్ణయించింది. గత జనరల్ బాడీ సమావేశంలోనే ఎన్నికల అధికారిగా అదనపు కార్యదర్శి ఎన్. శంకర్‌ను నియమించడం జరిగింది. ఆయనే ఎన్నికల అధికారిగా కొనసాగుతారు.

Next Story