ముగిసిన రెండవ విడత నామినేషన్ల ప్రక్రియ

by Muthe.Rajitha |

తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల జోరు నడుస్తోంది. రాష్ట్రంలో మూడు విడతలుగా జరగనున్న పంచాయితీ ఎన్నికల్లో రెండవ నామినేషన్ల ప్రక్రియ ఈరోజు సాయంత్రంతో ముగిసింది.

ముగిసిన రెండవ విడత నామినేషన్ల ప్రక్రియ
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల జోరు నడుస్తోంది. రాష్ట్రంలో మూడు విడతలుగా జరగనున్న పంచాయితీ ఎన్నికల్లో రెండవ నామినేషన్ల ప్రక్రియ ఈరోజు సాయంత్రంతో ముగిసింది. రెండవ విడతలో 4,333 గ్రామ పంచాయితీలకు ఎన్నికలు జరగనుండగా.. వీటికి సంబంధించి 12 వేలకు పైగా నామినేషన్లు వచ్చినట్టు సమాచారం. మొదటి విడత సర్పంచ్ ఎన్నికలు ఈనెల 11న జరగనుండగా.. రెండవ విడత ఎన్నికలు 14న నిర్వహించనుంది ఎన్నికల సంఘం. తొలి విడత ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ ప్రచారంలో జోరును పెంచగా.. వీరికి కేటాయించే గుర్తులు ఈనెల 4న ఎన్నికల సంఘం ప్రకటించనుంది.

ఇక రేపటి నుంచి రెండవ విడత ఎన్నికల ప్రచార ప్రక్రియ కూడా మొదలు కాబోతుండగా.. పల్లెల్లో ఎన్నికల జోష్ నడుస్తోంది. ఇప్పటికే తమ అనుకూలురకు మందు, మాంసం భారీగానే పంచుతున్నట్టు తెలుస్తుండగా.. డబ్బు ఏరులై పారుతోందని అంటున్నారు. మరోవైపు రేపటి నుంచి మూడవ విడత నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలు కాబోతోంది.

Next Story