- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేటి నుంచి రెండో విడత నామినేషన్లు షురూ.. నోటిఫికేషన్ విడుదల
పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి నామినేషన్లకు శనివారం రాత్రి వరకు నామినేషన్లు దాఖలయ్యాయి.

దిశ, తెలంగాణ బ్యూరో :తెలంగాణలో పంచాయతీ ఎన్నికల వేడి కొనసాగుతోంది. నిన్నటితో తొలివిడత నామినేషన్లకు గడువు ముగియగా.. నేటి నుంచి రెండో విడత నామినేషన్లు మొదలయ్యాయి. ఈ మేరకు ఆదివారం ఉదయం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండో విడతలో 31 జిల్లాల్లో 193 మండలాల్లో 4333 సర్పంచ్ స్థానాలకు, 38,350 వార్డు సభ్యులకు రెండో విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి ఏర్పాటు చేసిన రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయాల్లో నామినేషన్లను సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించనున్నారు. ఆదివారం అయినా కూడా ఎన్నికల నామినేషన్లు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేశారు. డిసెంబర్2వ తేదీ వరకు రెండో విడత నామినేషన్లు స్వీకరణ కొనసాగనుంది. డిసెంబర్ 6వ తేదీ అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. డిసెంబర్14న ఎన్నికల నిర్వహణ, అదే రోజు ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు.
పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి నామినేషన్లకు శనివారం రాత్రి వరకు నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజు కావడంతో మొదటి రెండు రోజుల్లో అభ్యర్థులు ఖరారు కాకపోవడం, పోటీపై సందిగ్దత, తమ శ్రేయోభిలాషులు, కుల పెద్దలు, గ్రామ పెద్దలు, పార్టీ పెద్దలతో చర్చించి పోటీ చేయాలా వద్దా అనే దానిపై చర్చల అనంతరం పోటీపై నిర్ణయం తీసుకున్నారు. దీంతో చివరి రోజు అత్యధికులు నామినేషన్లు దాఖలు చేశారు. మరికొన్ని గ్రామాల్లో గ్రామ వార్డు సభ్యులకు పోటీ చేయడానికి కొందరిని ఒప్పించి బరిలో నిలపాల్సి వచ్చిందని సమాచారం. మహిళా రిజర్వేషన్ ఉన్నదగ్గర పోటీకి అంతగా ముందుకు రాలేదని సమాచారం. వారి కుటుంబసభ్యులను ఒప్పించి పోటీకి నామినేషన్లు దాఖలు చేయించినట్లుగా సమాచారం. ఇలా వివిధ రకాల కారణాలతో చివరి రోజు అత్యదిక నామినేషన్లు దాఖలు చేసినట్లుగా ఎన్నికల అధికారులు తెలిపారు. రాత్రి వరకు 10 గంటల వరకు కూడా కొన్నిప్రాంతాల్లో నామినేషన్లు వేసినట్లుగా సమాచారం. దీంతో సర్పంచ్ పదవికి మొత్తం.. నామినేషన్లు దాఖలయ్యాయి. వార్డు సభ్యులకు.. నామినేషన్లు దాఖలయ్యాయి. ఆదివారం నామినేషన్లను పరిశీలించనున్నారు. తిరస్కరించిన నామినేషన్లపై సోమవారం అప్పీలు చేసుకునే అవకాశం ఉంది.






