- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
PJTAU: వ్యవసాయ, అనుబంధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు రెండో విడత కౌన్సెలింగ్
వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలైంది.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలైంది. ఈ మేరకు సోమవారం పీజేటీఏయూ (Professor Jayashankar Telangana Agricultural University) ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయాల పరిధిలోని వివిధ వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల (సెప్టెంబర్) 3, 4, 8, 9, 10 తేదీల్లో రెండో విడత సంయుక్త కౌన్సిలింగ్‌ను నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ డాక్టర్ జీ.ఇ. సీహెచ్ విద్యాసాగర్ ప్రకటించారు. రాజేంద్రనగర్ లోని విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఈ నెల 3, 4, 8, 9, 10 తేదీల్లో ప్రతిరోజూ ఉదయం 10 గంటలకి ఈ రెండో విడత కౌన్సిలింగ్ జరగనుందని ఆయన తెలిపారు. ఈ కౌన్సిలింగ్ కు సంబంధించిన పూర్తి వివరాల కోసం విశ్వవిద్యాలయం వెబ్ సైట్ www.pjtau.edu.in ను సందర్శించవచ్చని విద్యాసాగర్ సూచించారు.






