రెండో రోజు ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ

by Malleboina Mahesh |

తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేలపై జరుగుతున్న విచారణలు రెండో రోజుకు చేరుకున్నాయి.

రెండో రోజు ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేలపై జరుగుతున్న విచారణలు రెండో రోజుకు చేరుకున్నాయి. మొదటి విడతలో భాగంగా నలుగురు ఎమ్మెల్యేలను విచారించిన స్పీకర్, రెండో విడతలో మరో నలుగురిని విచారించేందుకు షెడ్యూల్ ఇచ్చారు. ఇందులో భాగంగా నిన్న (గురువారం) భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కేసులను స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారించారు. అలాగే ఈ రోజు ఉదయం 11 గంటలకు పోచారం శ్రీనివాస్ రెడ్డి Vs జగదీశ్ రెడ్డి కేసు విచారణ జరగనుండగా, పిటిషన్ వేసిన జగదీశ్ రెడ్డిని పోచారం తరపు అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు అరికెపూడి గాంధీ Vs కల్వకుంట్ల సంజయ్ కేసు విచారణ జరుగనుంది.

ఈ విచారణలో సంజయ్‌ను గాంధీ తరపు న్యాయవాదులు ప్రశ్నించనున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఈ విచారణలను పర్యవేక్షిస్తున్నారు. నవంబర్ 12, 13 తేదీల్లో మరికొన్ని కేసులపై విచారణ జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు తీర్పుతో చర్యలు ప్రారంభించిన స్పీకర్ 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. వీరిలో 8 మంది స్పీకర్ నోటీసులకు స్పందించగా.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే ధానం నాగెందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పీకర్ నోటీసులపై ఇంకా స్పందించలేదు. మరి వీరిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎటువంటి చర్యలు తీసుకుంటారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Next Story