వారి ఇళ్లలో రాత్రిపూట సోదా చేయడం దారుణం.. హరీష్ రావు సంచలన ట్వీట్

by Ramesh Goud |

వారి ఇళ్లలో రాత్రిపూట సోదా చేయడం దారుణమని, దీనినే ప్రజాపాలన అంటారా అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు (BRS Leader Harish Rao) అన్నారు.

వారి ఇళ్లలో రాత్రిపూట సోదా చేయడం దారుణం.. హరీష్ రావు సంచలన ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: వారి ఇళ్లలో రాత్రిపూట సోదా చేయడం దారుణమని, దీనినే ప్రజాపాలన అంటారా అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు (BRS Leader Harish Rao) అన్నారు. హెచ్ సీయూ భూముల వ్యవహారం (HCU Lands Dispute)లో సోషల్ మీడియాలో ఫేక్ వీడియోలను పోస్ట్ చేశారని బీఆర్ఎస్ సోషల్ మీడియా నేతలు (BRS Social Media leaders) కొణతం దిలీప్ (Konatham Dileep), మన్నె క్రిశాంక్ (Manne Krishank) లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో భాగంగా బుధవారం పోలీసులు కొణతం దిలీప్ తో పాటు మన్నె క్రిశాంక్ దాదాపు 9 గంటల పాటు విచారించారు.

అంతేగాక ఈ నెల 14న మరోసారి విచారణకు హాజరుకావాలని చెప్పారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన హరీష్ రావు.. కాంగ్రెస్ పార్టీ (Congress party)పై పలు విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. పోలీసు అధికారులు కొణతం దిలీప్, క్రిశాంక్ లను 9 గంటలపాటు విచారించడం ప్రజాపాలన అంటారా? అని ప్రశ్నించారు. హెచ్‌సీయూ విద్యార్థులు (HCU Students), హైదరాబాద్ జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు మద్దతు ఇచ్చినందుకు, ఇప్పుడు వారి ఫోన్ల కోసం వారి ఇళ్లలో రాత్రి పూట సోదా చేయడం దారుణమని మండిపడ్డారు. ఇక రాహుల్ గాంధీ (Rahul Gandhi) రాజ్యాంగం, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం.. కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో అదే విలువలను ఖూనీ చేయడం.. కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే (BRS MLA) రాసుకొచ్చారు.

Next Story