వ‌రంగ‌ల్‌లో ఐటీ దాడుల క‌ల‌క‌లం.. బాల‌వికాస స్వచ్ఛంద సంస్థలో సోదాలు

by GSrikanth |
వ‌రంగ‌ల్‌లో ఐటీ దాడుల క‌ల‌క‌లం.. బాల‌వికాస స్వచ్ఛంద సంస్థలో సోదాలు
X

దిశ‌, వ‌రంగల్ బ్యూరో: వ‌రంగ‌ల్‌లో మరోసారి ఐటీ సోదాల క‌ల‌క‌లం రేపాయి. వ‌రంగ‌ల్ బాల‌వికాస స్వచ్ఛంద సంస్థ, అనుబంధ సంస్థల‌కు సంబంధించిన రికార్డుల‌ను ఐటీ అధికారులు బుధవారం ఉదయం నుంచి త‌నిఖీ చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 40 ప్రాంతాల్లోని స్వచ్ఛంద సంస్థల‌పై ఐటీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాలోనే ప్రముఖ‌మైన బాల‌వికాస స్వచ్ఛంద సంస్థ ప్రధాన కార్యాల‌య‌మైన హ‌న్మకొండ జిల్లా కాజీపేట ఫాతిమాన‌గ‌ర్‌లోని కార్యాల‌యంలో ఇవాళ తెల్లవారుజాము నుంచే ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బాలవికాస సంస్థకు సంబంధించిన ముఖ్య కార్యాల‌యాల్లో దాడులు జ‌రుగుతున్నట్లుగా తెలుస్తోంది.



Next Story