ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్​ల పరిశీలన పూర్తి

by Muthe.Rajitha |

శాసనమండలి ఎన్నికల్లో భాగంగా నామినేషన్​ల పరిశీలన పూర్తి అయింది.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల  నామినేషన్​ల పరిశీలన పూర్తి
X

దిశ, తెలంగాణ బ్యూరో : శాసనమండలి ఎన్నికల్లో భాగంగా నామినేషన్​ల పరిశీలన పూర్తి అయింది. మంగళవారం నామినేషన్​ల పరిశీలనను రిటర్నింగ్​ అధికారి ఉపేందర్​ రెడ్డి చేపట్టారు. ఆరు గురు అభ్యర్థులు నామినేషన్​ ఫారాలను సరియైన విధంగా పూర్తి చేయకపోవడంతో వాటిని తిరస్కరించినట్లుగా ప్రకటించారు. బరిలో ఐదుగురు అభ్యర్థులు మాత్రమే మిగిలారు. కాంగ్రెస్​కు చెందిన ముగ్గురు విజయశాంతి, అద్దంకి దయాకర్​, శంకర్​ నాయక్​, సీపీఐ నుంచి నెల్లికంటి సత్యం, బీఆర్​ఎస్​ దాసోజు శ్రవణ్​ లు ఉన్నారు. వీరు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా గురువారం ప్రకటించనున్నారు. రేపు మధ్యాహ్నం తరువాత ఎన్నికైనట్లుగా వారికి దృవీకరణ పత్రాలను అందిస్తారు. వీరు మార్చి 30వ తేదీ నుంచి ఎమ్మెల్సీలుగా కొనసాగనున్నారు.

Next Story