- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అరేయ్..! స్కూల్ కన్నా చెరువే ఎక్కువైంది కదరా..!
కంగ్టి మండలంలోని భీమ్రా ప్రాథమిక ఉన్నత పాఠశాల వర్షం పడితే అచ్చంగా చెరువులా మారిపోతుంది.

దిశ, కంగ్టి: కంగ్టి మండలంలోని భీమ్రా ప్రాథమిక ఉన్నత పాఠశాల వర్షం పడితే అచ్చంగా చెరువులా మారిపోతుంది. శనివారం నాడు సాయంత్రం మూడు గంటల ప్రాంతంలో కురిసిన వర్షానికి స్కూల్ ఆవరణ మొత్తం నీటమునిగిపోయింది. పిల్లలు ముంపు నీటిలో నడుచుకుంటూ బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొందరైతే తల్లిదండ్రులు లేదా టీచర్లు చేయిపట్టి బయటకు తీసుకురావాల్సి వచ్చింది. ఈ దృశ్యాన్ని ఎవరైనా చూస్తే ఇది స్కూలా- చెరువా? అని ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రతి వర్షాకాలంలో పరిస్థితి ఇలాగే ఉంటోందని స్థానికులు చెబుతున్నారు. మౌలిక వసతుల్లేక పిల్లల భద్రతే ప్రశ్నార్థకమైందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇలా నీటిలో తడుస్తూ పిల్లలు ఎలా చదువుకుంటారు? ముందు స్కూల్‌కి డ్రైనేజ్ వేసేలా చూడండి అని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి మౌలిక వసతులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.






