- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థులకు అలర్ట్..వరుసగా మూడు రోజులు స్కూళ్లకు సెలవులు?
తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు అలర్ట్. వచ్చే వారంలో తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల పాటు పాఠశాలలకు సెలవు ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు అలర్ట్. వచ్చే వారంలో తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల పాటు పాఠశాలలకు సెలవు ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ పరిస్థితి ఉన్నట్లు చెబుతున్నారు. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఈనెల 13వ తేదీన జరగనుంది. ఆ రోజు శుక్రవారం అవుతోంది. ఈ తరుణంలో ఎన్నికల కౌంటింగ్ జరిగే ప్రాంతాల్లో పాఠశాలలకు హాలిడే ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
దీనిపై అధికారులు మరో మూడు రోజుల్లో ప్రకటన చేసే ఛాన్స్ ఉన్నట్లు చెబుతున్నారు. ఇక ఆ తర్వాత ఫిబ్రవరి 14వ తేదీన సెకండ్ శనివారం, ఫిబ్రవరి 15వ తేదీన ఆదివారం.. అంటే వరుసగా సెలవులు వస్తాయి. ఓవరాల్ గా చూస్తే మూడు రోజుల పాటు విద్యార్థులకు హాలిడేస్ లభించనున్నాయి. దీంతో విద్యార్థుల సంబరాలు చేసుకుంటున్నారు.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హడావిడి
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల హడావిడి స్పష్టంగా కనిపిస్తోంది. ఫిబ్రవరి 3వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. దీంతో ప్రచారంలో దూసుకుపోతున్నాయి ప్రధాన పార్టీలు. గులాబీ పార్టీ, కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటాపోటీ నడుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ లతోపాటు 116 మున్సిపాలిటీలలో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 11వ తేదీన ఈ ఎన్నికలు నిర్వహిస్తారు. 13వ తేదీన రిజల్ట్ ఉంటుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఇది ఇలా ఉండగా, నిన్నటి నుంచి ఏక గ్రీవాల ప్రక్రియ కూడా షురూ అయింది. ఇప్పటికే 15 వార్డులలో ఏక గ్రీవం అయినట్లు సమాచారం.






