రాష్ట్రంలో పాఠశాల విద్య మెరుగుపడింది.. విద్యాశాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి

by Kema Shiva Kumar |

గత బీఆర్ఎస్ పాలనలో విద్యా వ్యవస్థ విధ్వంసమైందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.

రాష్ట్రంలో పాఠశాల విద్య మెరుగుపడింది.. విద్యాశాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో పాఠశాల విద్య (School Education) పనితీరు గణనీయంగా మెరుగుపడిందని సీఎం రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఇవాళ విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విద్యా రంగంలో సాధించిన ప్రగతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు, పాఠశాలల పనితీరు మెరుగుపడిందని కేంద్ర విద్యాశాఖ స్వయంగా వెల్లడించిందని సీఎం గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన పీజీఐ (Performance Grading Index - PGI) నివేదిక తమ ప్రజా ప్రభుత్వం కనబరిచిన అద్భుత పనితీరుకు ప్రత్యక్ష నిదర్శనమని పేర్కొన్నారు. విద్యాశాఖ పనితీరుపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ సానుకూల నివేదికలు భవిష్యత్తులో మరిన్ని సంస్కరణలు తీసుకురావడానికి తమకు ఎంతో ప్రేరణనిచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

గత బీఆర్ఎస్ పాలనపై ధ్వజం..

గత పదేళ్ల బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో విద్యా వ్యవస్థ పూర్తిగా విధ్వంసమైందని మండిపడ్డారు. నాటి సర్కార్ ప్రభుత్వ విద్యా రంగాన్ని నిర్వీర్యం చేస్తే.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక శ్రద్ధ వహించి పాఠశాల విద్యను మళ్లీ పట్టాలెక్కించామని, అందుకే ఇప్పుడు జాతీయ స్థాయిలో తెలంగాణకు గుర్తింపు దక్కిందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Next Story