- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్రూప్స్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. వచ్చే నెల 7న స్కాలర్ షిప్ టెస్ట్.. పూర్తి వివరాలు ఇవే!
by Satheesh |
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో త్వరలో నిర్వహించే గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు స్కాలర్ షిప్ టెస్ట్ నిర్వహించనున్నట్లు

X
దిశ, తెలంగాణ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో త్వరలో నిర్వహించే గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు స్కాలర్ షిప్ టెస్ట్ నిర్వహించనున్నట్లు 21 సెంచరీ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ కృష్ణ ప్రదీప్ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనే ఆసక్తి ఉండి ఆర్థికంగా వెనుకబడిన అభ్యర్థులను ప్రోత్సహించేందుకు ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వచ్చే నెల 7వ తేదీన ఆన్ లైన్ విధానంలో ఈ పరీక్షను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పరీక్షలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు ఉచితంగా గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలకు శిక్షణ అందిస్తామని ఆయన స్పష్టంచేశారు. రిజిస్ట్రేషన్, పరీక్ష సిలబస్, తదితర వివరాల కోసం 91332 37733, 91336 37733 నంబర్లకు సంప్రదించాలని 21 సెంచరీ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ కృష్ణ ప్రదీప్ సూచించారు.
Next Story






