స్కాలర్ షిప్‌ల ధరఖాస్తులకు సెప్టెంబర్ 30 వరకు అవకాశం

by Ajay Maddhiboyina |

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీలు, వికలాంగుల విద్యార్థులకు 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఈ-పాస్ స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 1 న ప్రారంభమైంది.

స్కాలర్ షిప్‌ల ధరఖాస్తులకు సెప్టెంబర్ 30 వరకు అవకాశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీలు, వికలాంగుల విద్యార్థులకు 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఈ-పాస్ స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 1 న ప్రారంభమైంది. ఫ్రెష్, రెన్యూవల్ స్కాలర్‌షిప్‌ల కోసం అర్హులైన విద్యార్థులు సెప్టెంబర్ 30 లోపు తమ దరఖాస్తులను సమర్పించాలని సంబంధిత అధికారులు తెలియజేశారు. సాధారణంగా, ఈ పాస్ స్కాలర్‌షిప్‌లు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులకు ఉన్నత విద్యను అభ్యసించడానికి సహాయపడుతుంది.

అర్హత కలిగిన విద్యార్థులు సకాలంలో దరఖాస్తు చేసుకోవడం ద్వారా ప్రభుత్వ సహాయాన్ని పొందవచ్చు. విద్యార్థులు మరింత సమాచారం కోసం, దరఖాస్తు చేసుకోవడానికి ఈ-పాస్ అధికారిక వెబ్‌సైట్‌ తెలంగాణ ఈ-పాస్ వెబ్‌సైట్ http://telanganaepass.cgg.gov.inను సందర్శించవచ్చు. దరఖాస్తు చేసుకునే ముందు, అవసరమైన అన్ని పత్రాలను సిద్ధం చేసుకోవాలని, సూచనలను క్షుణ్ణంగా చదవాలని అధికారులు సూచించారు. అన్ని సంక్షేమ శాఖలు రెన్యూవల్, ఫ్రెష్ స్కాలర్‌షిప్‌ల రిజిస్ట్రేషన్ ప్రక్రియపై విస్తృతంగా ప్రచారం కల్పించి, సెప్టెంబర్ 30 నాటికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు. .

Next Story