పాఠశాల క్రీడల నిర్వహణకు షెడ్యూల్ విడుదల.. విద్యా శాఖ ఉత్తర్వులు జారీ

by Kema Shiva Kumar |

2025-2026 విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాల క్రీడల షెడ్యూల్‌ను తెలంగాణ పాఠశాల విద్యా శాఖ విడుదల చేసింది.

పాఠశాల క్రీడల నిర్వహణకు షెడ్యూల్ విడుదల.. విద్యా శాఖ ఉత్తర్వులు జారీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: 2025-2026 విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాల క్రీడల షెడ్యూల్‌ను తెలంగాణ పాఠశాల విద్యా శాఖ విడుదల చేసింది. రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ల కేటాయింపుపై హైదరాబాద్‌లో పాఠశాల విద్య డైరెక్టర్ డా.ఇ. నవీన్ నికోలస్ అధ్యక్షతన జిల్లా స్కూల్ గేమ్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో క్రీడల సజావుగా నిర్వహణకు, మెరుగైన మౌలిక సదుపాయాలు ఉన్న జిల్లాలకు టెక్నికల్ క్రీడలను కేటాయించాలని నిర్ణయించారు. మండల, జిల్లా స్థాయి క్రీడలు ఈ సెప్టెంబర్ రెండో వారం నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లు సెప్టెంబర్ నాలుగో వారం నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులు అక్టోబర్ 6 నుంచి ప్రారంభమయ్యే జాతీయస్థాయి టోర్నమెంట్లలో పాల్గొంటారు. ఈ టోర్నమెంట్లను స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్ జీఎఫ్) ద్వారా 14, 17,19 ఏళ్ల లోపు వయస్సుల వారికి నిర్వహించనున్నారు. క్రీడాకారులు ఈ షెడ్యూల్ ప్రకారం తమ సన్నాహాలను వేగవంతం చేసుకోవాలని అధికారులు సూచించారు.

Next Story