- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
T Congress కాంగ్రెస్ జనహిత పాదయాత్ర రెండో విడత షెడ్యూల్ విడుదల.. ఈ సారి ఏయే నియోజకవర్గాలు అంటే?
కాంగ్రెస్ జనహిత పాదయాత్ర రెండో విడత షెడ్యూల్ విడుదలైంది.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: తెలంగాణ పీసీసీ తలపెట్టిన జనహిత పాదయాత్ర (Janahita Padayatra) రెండో విడత ఈ నెల 24 నుంచి మొదలు కానుంది. ఈ మేరకు ఇవాళ పీసీసీ షెడ్యూల్ విడుదల చేసింది. 24వ తేదీ చొప్పదండి నియోజకవర్గం లో సాయంత్రం 5 గంటలకు జనహిత పాదయాత్ర ప్రారంభం అవుతుంది. 25వ తేదీ ఉదయం 7 నుంచి 9 గంటల వరకు శ్రమదానం, ఉదయం 10:30 గంటల నుంచి కరీంనగర్ జిల్లా కార్యకర్తల సమ్మేళనం ఉంటుంది. 25వ తేదీ సాయంత్రం 5 గంటలకు వర్ధన్నపేట నియోజకవర్గంలో జనహిత పాదయాత్ర, 26వ తేదీ ఉదయం 7 నుంచి 9 గంటల వరకు శ్రమదానం, 10.30 గంటలకు వరంగల్ జిల్లా కార్యకర్తల సమ్మేళనం ఉండనుంది. 26వ తేదీ సాయంత్రం 6 గంటలకు జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నట్లు టీపీసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది.
రేపు జూమ్ మీటింగ్:
డీసీసీ అధ్యక్షులు, ఉమ్మడి జిల్లా టీపీసీసీ ఇంచార్జ్ లతో రేపు జూమ్ మీటింగ్ నిర్వహించబోతున్నట్లు పీసీసీ తెలిపింది. బుధవారం మధ్యాహ్నం 1 గంటలకు జూమ్ సమావేశం ఉంటుందని ఈ మీటింగ్ కు ఏఐసీసీ ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మీటింగ్ లో పాల్గొంటారని ఈ మేరకు టీపీసీసీ సమాచారం ఇచ్చింది.






