- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్(10th Class Exams Schedule) విడుదలైంది. వచ్చే ఏడాది మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ తెలిపింది. ఈ మేరకు మంగళవారం అధికారిక ప్రకటన చేసింది. మరోవైపు.. రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 13 వరకు జరగనున్నాయి. ఆ తర్వాత మార్చి 14 నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. అంతేకాకుండా ఈ ఏడాది ఒక్కో ఎగ్జామ్‌కు మధ్య ఒకరోజు గ్యాప్ ఇచ్చేలా ప్లాన్ చేశారు. స్టూడెంట్స్‌పై ఒత్తిడి లేకుండా ఈ గ్యాప్ ఉపయోగపడుతుందని అధికారులు భావించారు. మరోవైపు టెన్త్ ఎగ్జామ్స్ నిర్వహణకు ఏర్పాట్లు చకాచకా చేసేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్ష నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. హాల్ టికెట్ల జారీ, విద్యార్థులపై ఒత్తిడి లేకుండా సమయానికి సిలబస్ పూర్తి చేయడం, పరీక్షల షెడ్యూల్ విడుదల చేస్తామని అంటున్నారు.






