కామారెడ్డి మున్సిపాలిటీలో సీన్ రివర్స్.. కాంగ్రెస్, BRS మధ్య కుదిరిన సయోధ్య

by Kema Shiva Kumar |

మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నికలో రాష్ట్రం అంతటా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఉప్పు, నిప్పుగా ఉన్నాయి. కానీ, కామారెడ్డి మున్సిపాలిటీలో మాత్రం పరిస్థితి రోటీన్‌కు భిన్నంగా ఉంది.

కామారెడ్డి మున్సిపాలిటీలో సీన్ రివర్స్.. కాంగ్రెస్, BRS మధ్య కుదిరిన సయోధ్య
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ (Congress), ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ (BRS) మధ్య మాటల తూటాలు పేలుతున్న వేళ కామారెడ్డి మున్సిపాలిటీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అక్కడ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ పదవులను రెండు పార్టీలు పంచుకున్నట్లుగా తెలుస్తోంది. మున్సిపల్ చైర్ పర్సన్‌గా 38వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఉమారాణి (Uma Rani) కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో ఆమె పేరును చైర్మన్ అభ్యర్థిగా ఆ పార్టీ ఖరారు చేసింది. ఇక వైస్ చైర్ పర్సన్‌గా 12వ వార్డు అభ్యర్థి కాసర్ల గోదావరి (Kasarla Godavari) అభ్యర్థిత్వం ఇప్పటికే డిసైడ్ అయింది. అయితే, అధికారికంగా ఎన్నిక జరిగే వరకు విషయాన్ని నేతలు అత్యంత గోప్యంగా ఉంచుటున్నట్లుగా తెలుస్తోంది.

కాగా, కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 49 వార్డులు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ 19 చోట్ల విజయం సాధించింది. బీజేపీ 16, బీఆర్ఎస్ 11 వార్డుల్లో, ఇండిపెండెంట్లు మూడు చోట్ల గెలుపొందారు. మున్సిపాలిటీ పీఠాన్ని కైవసం చేసుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 25 సీట్లు కావాల్సి ఉంది.

Next Story