- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉప్పల్ స్టేడియంలో నకిలీ టికెట్ల కలకలం
by Sathputhe Rajesh |
ఉప్పల్ స్టేడియంలో నకిలీ టికెట్లు కలకలం రేపాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: ఉప్పల్ స్టేడియంలో నకిలీ టికెట్లు కలకలం రేపాయి. సన్ రైజర్స్ మ్యాచ్ లకు ఫేక్ టికెట్లు విక్రయించడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 18న జరిగిన సన్ రైజర్స్, ముంబై మ్యాచ్ లో ఫేక్ టికెట్ల వ్యహహారం బయటపడింది. ఓ యువతి పేటీఎంలో 10 టికెట్లు కొనుగోలు చేసింది. తీరా మ్యాచ్ చూసేందుకు వెళ్లగా తమ సీట్లలో వేరు వాళ్లు కూర్చోవడాన్ని గమనించింది. వారిని ఆరా తీయగా ఫేక్ టికెట్ల బాగోతం వెలుగు చూసింది. అయితే నిన్నటి మ్యాచ్ లోనూ ఫేక్ టికెట్లు సంచలనం సృష్టించాయి. దీంతో ఫేక్ టికెట్ల ఎపిసోడ్‌పై సదరు యువతి ఉప్పల్ పీఎస్ లో ఫిర్యాదు చేసింది. ఈ కేసులో పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు.
Next Story






