'తెలంగాణలోని SC రిజర్వ్ నియోజకవర్గాల్లో గెలుపు బీజేపీదే'

by Disha Web Desk 2 |
తెలంగాణలోని SC రిజర్వ్ నియోజకవర్గాల్లో గెలుపు బీజేపీదే
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని అన్ని ఎస్సీ రిజర్వ్ డ్ సెగ్మెంట్లలో బీజేపీ గెలుపు ఖాయమని పార్టీ ఎస్సీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లాల్ సింగ్ ఆర్య ధీమా వ్యక్తంచేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన ఎస్సీ మోర్చా రాష్ట్ర పదాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని జిల్లాలు, మండాలాల్లోని ఎస్సీ ముఖ్య నాయకులంతా నిత్యం ప్రజా సేవలో ఉండాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రజల సమస్యలపై పలు కార్యక్రమాలు చేపట్టి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలోని 19 ఎస్సీ సెగ్మెంట్లు, మూడు పార్లమెంట్ స్థానాల్లో విజయకేతనం ఎగురవేయాలని నొక్కి చెప్పారు. ఈ సమావేశంలో ఎస్సీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి శంభూనాథ్ తుండియా, ఎస్సీ మోర్చా రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు బాషా, ఎస్సీ మోర్చా ఇన్చార్జి మనోహర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు వేముల అశోక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కుమ్మరి శంకర్, కాంతి కిరణ్, రాష్ట్ర పదాధికారులు పాల్గొన్నారు.

READ MORE

బండి సంజయ్‌కే సవాల్ విసురుతావా?: సుభాష్

Next Story

Most Viewed