ఎస్సీ గురుకుల డిగ్రీ అడ్మిషన్లు ఎప్పుడో?

by Muthe.Rajitha |

ప్రస్తుతానికి విద్యాసంవత్సరం మొదలుకావడానికి మరికొద్దిరోజులే సమయం ఉన్నది.

ఎస్సీ గురుకుల డిగ్రీ అడ్మిషన్లు ఎప్పుడో?
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రస్తుతానికి విద్యాసంవత్సరం మొదలుకావడానికి మరికొద్దిరోజులే సమయం ఉన్నది. ఈక్రమంలో తెలంగాణలోని గురుకుల డిగ్రీ కాలేజీల్లో ఇప్పటివరకు డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కాలేదు. అయితే, రెగ్యులర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ అడ్మిషన్లు ప్రారంభమై మొదటి దశ ముగిసింది. అయితే, గురుకులాల్లో మాత్రం ఇందుకు భిన్నంగా ఉండడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యాసంవత్సరం ఆరంభం షెడ్యూల్ కంటే చాలా వెనుకబడి ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. ఈవిషయంలో గురుకులాల అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నాతాధికారుల నిర్వాకం వల్ల లక్షలాది మంది పేద విద్యార్థులపై ప్రభావంపై పడనుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు అడ్మిషన్ల ప్రక్రియ మొదటపెట్టకపోతే డిగ్రీలో చేరే విద్యార్థుల ప్రవేశానికి మరింత ఆలస్యం జరిగే అవకాశమందని అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో అధికారులను ఒక సామాజిక కార్యకర్త సీఎం రేవంత్​రెడ్డి, డిప్యూటీ భట్టి విక్రమార్కతోపాటు విద్యాకమిషన్​చైర్మన్​కు ఎక్స్​వేదికగా ప్రశ్నించారు. అధికార యంత్రాంగం తీరుతో ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువచ్చేలా ఉందని పేర్కొన్నారు. ఇదే విషయమై గురుకులాల అధికార యంత్రాంగాన్ని సంప్రదించగా ప్రస్తుతానికి డిగ్రీ కళాశాలల పరీక్షలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఎగ్జామ్​పూర్తయ్యాకే అడ్మిషన్లకు నోటిఫికేషన్లు ఇవ్వడం జరుగుతుందని వివరించారు. మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ డిగ్రీ కాలేజీలలో 25,200 సీట్లు ఉన్నాయి.

తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి కాలేజీలు..

ఆదిలాబాద్

ఆర్మూర్

భూపాలపల్లి

కామారెడ్డి

కరీంనగర్

ఖమ్మం

కొత్తగూడెం

మహబూబ్ నగర్

మంచిర్యాల

మెదక్

నాగర్ కర్నూల్

నల్గొండ

నిర్మల్

నిజామాబాద్

సిద్దిపేట

సిరిసిల్ల

సూర్యాపేట

వికారాబాద్

వనపర్తి

వరంగల్ తూర్పు

–––––––––

స్పెషల్​డిగ్రీ కాలేజీలు..

జగిత్యాల

ఎల్బీనగర్​

మహబూబాబాద్​


Next Story