- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SBI Vs తెలంగాణ ప్రభుత్వం.. ఎస్‍బీఐ పై ఫిర్యాదుకు సర్కార్ సిద్ధం!
రాయదుర్గం భూముల వేలం తర్వాత ఎస్‌బీఐ కోర్టుకెక్కడం వెనుక రాజకీయ కుట్ర ఉందని భావిస్తున్న తెలంగాణ సర్కారు.. పీఎం, ఆర్‌బీఐకి ఫిర్యాదు చేయబోతున్నట్లు తెలుస్తోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర రాజధానిలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరొందిన రాయదుర్గం నాలెడ్జ్ సిటీ భూముల వేలం వ్యవహారం ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ భూముల వేలం అంశం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) గా మారింది. ఈ వ్యవహారంలో ఎస్‌బీఐ వ్యవహరిస్తున్న తీరుపై రాష్ట్ర సర్కారు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సదరు బ్యాంకు పట్ల కఠిన వైఖరిని అవలంబించాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
రాజకీయ ఒత్తిళ్లు, కుట్ర కోణం:
ఈ మేరకు ఇవాళ రాయదుర్గం భూముల వ్యవహారంలో ఎస్‍బీఐ తీరుపై ప్రభుత్వం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించింది. అయితే ముందు ప్రత్యామ్నాయ భూమికి అంగీకరించిన ఎస్‌బీఐ తీరా వేలం వేశాక కోర్టుకెక్కడం వెనుక రాజకీయ కుట్ర కోణం ఉందనే అనుమానాలు ప్రభుత్వంలో వ్యక్తం అవుతున్నాయి. దీంతో ఎస్‍బీఐ పై ఆర్ బీఐ, ఆర్థిక శాఖ, ప్రధానికి ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.






