సౌదీ బస్సు ప్రమాదం.. పరిహారం విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

by Kema Shiva Kumar |

సౌదీ అరేబియా (Saudi Arabia)లో నవంబర్ 17న జరిగిన ఘోర ప్రమాదం హైదరాబాద్‌‌లోని పలు కుటుంబాల్లో అంతులేని విషాదం మిగిల్చిన విషయం తెలిసిందే.

సౌదీ బస్సు ప్రమాదం.. పరిహారం విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
X

దిశ, వెబ్‌డెస్క్: సౌదీ అరేబియా (Saudi Arabia)లో నవంబర్ 17న జరిగిన ఘోర ప్రమాదం హైదరాబాద్‌‌లోని పలు కుటుంబాల్లో అంతులేని విషాదం మిగిల్చిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో మొత్తం 45 మంది సజీవ దహనం కాగా.. హైదరాబాద్‌లోని విద్యానగర్ ప్రాంతానికి చెందిన నజీరుద్దీన్‌ కుటుంబంలోని రెండేళ్ల నుంచి 12 ఏళ్ల లోపు చిన్నారులంతా ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే బాధిత కుటుంబాలకు భరోసా కల్పిస్తూ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. బాధితులకు ఎక్స్‌‌‌‌గ్రేషియా చెల్లించేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.3.07 మంజూరు చేశారు. ఈ మేరకు మైనారిటీ సంక్షేమ శాఖ నుంచి జీవో నం.125 ద్వారా నిధుల మంజూరుకు ఉత్తర్వులు వెలువడ్డాయి. కాగా, ఈ మొత్తాన్ని తెలంగాణ హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఖాతా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫతే మైదాన్ బ్రాంచ్‌లో జమ చేయాలని సీఎంవో అధికారులు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Next Story