మనోవేదనకు గురై సాత్విక్ సూసైడ్! చితకబాదిన దృశ్యాలు వైరల్ (వీడియో)

by Disha Web Desk 4 |
మనోవేదనకు గురై సాత్విక్ సూసైడ్! చితకబాదిన దృశ్యాలు వైరల్ (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో : వార్డెన్ వేధింపులు తట్టుకోలేక రంగారెడ్డి జిల్లా నార్సింగి శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ విద్యార్థి సాత్విక్ కాలేజీ క్లాస్‌రూంలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. సాత్విక్ ఆత్మహత్యకు యాజమాన్యమే కారణం అని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీ చైతన్య కాలేజీలో ఓ వ్యక్తి విద్యార్థులను చితకబాదిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో క్లాస్‌రూంలోని తోటి విద్యార్థుల ముందే అతడు ఓ విద్యార్థిపై చేయిచేసుకున్నాడు.

అయితే, ఈ వీడియోలో ఉంది సాత్విక్, వార్డెన్ ఏనా? అనేది తెలియడంలేదు. కానీ, కాలేజీ యాజమాన్యం వేధింపులకు గురి చేయడంతోనే సాత్విక్ సూసైడ్ చేసుకున్నాడని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఈ వీడియోలు ప్రత్యక్షం కావడంతో సాత్విక్ మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.


Next Story