మైదానాలు ఆరోగ్య ఆలయాలు: శాట్స్ చైర్మన్

by Disha Web Desk 2 |
మైదానాలు ఆరోగ్య ఆలయాలు: శాట్స్ చైర్మన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: క్రీడల ద్వారా మాత్రమే ఆరోగ్యం, ఉత్సాహవంతులైన ప్రతిభావంతులు సమాజానికి లభిస్తారని శాట్స్ చైర్మన్ డాక్టర్ ఆంజనేయగౌడ్ అన్నారు. ఆదివారం గచ్చిబౌలిలో హైదరాబాద్ డిస్ట్రిక్ట్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 100 మీటర్స్ రన్ "స్ప్రింట్" ఛాంపియన్ షిప్ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. క్రీడాకారులు ఏ రంగంలో ఉన్న విజేతలుగా నిలుస్తారన్నారు. మైదానాలు ఆరోగ్య ఆలయాలు అన్నారు. ప్రయివేట్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు సైతం, క్రీడాకారులను, క్రీడా అసోసియేషన్‌లకు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్లెట్ విద్యా సంస్థల అధినేత వాసిరెడ్డి అమరనాథ్, అర్జున, ద్రోణాచార్య అవార్డు గ్రహీతలు రమేష్, శోభ, అథ్లెటిక్ అసోసియేషన్ కు చెందిన ప్రొఫెసర్ రాజేష్, సారంగ పాణి, ఆంజనేయులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.


Next Story