- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బయో సైన్సెస్ సీఈవోగా సర్వేశ్‌సింగ్
రాష్ట్ర బయోసైన్సెస్ డైరెక్టర్, సీఈవోగా సర్వేశ్‌సింగ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర బయోసైన్సెస్ డైరెక్టర్, సీఈవోగా సర్వేశ్‌సింగ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబును కలిశారు. లైఫ్ సైన్సెస్, బయో టెక్నాలజీ రంగాల్లో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ నూతన ఆవిష్కరణల్లో మరింత వేగంగా దూసుకెళ్తున్నదని మంత్రి వెల్లడించారు. ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో తనకున్న 22 ఏళ్ల అపార అనుభవాన్ని రాష్ట్రంలో మంచి ఎకో సిస్టంను నెలకొల్పేందుకు వినియోగించాలని సూచించారు. ప్రపంచానికి సరఫరా అవుతున్న వ్యాక్సిన్లలో మూడో వంతు రాష్ట్రం నుంచే ఎగుమతి అవుతున్న విషయాన్ని గుర్తుచేశారు. ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా హైదరాబాద్ ఎదిగిందని తెలిపారు. ఫార్మా ఎగుమతుల్లో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్నామని చెప్పారు. జినోమ్ వ్యాలీని మరింత విస్తరించి, మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ద్వారాలు తెరుస్తున్నామని వెల్లడించారు.






