- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కారుకు దారివ్వలేదని సర్పంచ్ భర్త దాష్టీకం.. దళితుడిపై విచక్షణారహితంగా దాడి
జగిత్యాల జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కేవలం కారుకు దారి ఇవ్వలేదని దళిత వ్యక్తిపై సర్పంచ్ భర్త, అనుచరులు కులం పేరుతో దూషిస్తూ అమానుషంగా దాడికి పాల్పడ్డారు.

దిశ, వెబ్‌డెస్క్: తన కారుకు దారి ఇవ్వలేదని సర్పంచ్ భర్త దళితుడిపై దాడికి పాల్పడిన ఘటన జగిత్యాల (Jagityal) జిల్లా బుగ్గారం మండల పరిధిలోని చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. చిన్నాపూర్ (Chinnapur) గ్రామానికి చెందిన తిరుపతి (Tirupati) అనే దళిత వ్యక్తిపై స్థానిక సర్పంచ్ శారద భర్త గంగారాం (Gangaram), మరో ముగ్గురు వ్యక్తులు కలిసి అమానుషంగా అత్యంత ప్రవర్తించారు. తిరుపతి రోడ్డుపై వెళ్తున్న సమయంలో గంగారాం కారుకు దారి ఇవ్వలేదని వివాదం మొదలైంది. ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన గంగారాం, అతడి అనుచరులు తిరుపతిని కులం పేరుతో నోటితో చెప్పలేని విధంగ బూతులు తిడుతూ తీవ్రంగా దాడి చేశారు. అంతటితో ఆగకుండా బాధితుడిని రోడ్డుపై ఈడ్చి పారేసి పైశాచిక ఆనందాన్ని పొందారు.
సీసీ కెమెరాల్లో రికార్డైన దాడి దృశ్యాలు..
ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. సర్పంచ్ భర్త అంతలా రెచ్చిపోయి ఒక వ్యక్తిని చితకబాదుతున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ వైరల్‌గా మారాయి. ఇది చూసిన గ్రామస్థులు, దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే, తమపై జరిగిన అన్యాయంపై బాధితుడు తిరుపతి కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్ (Police Station)లో ఫిర్యాదు చేశారు. గంగారాంతో పాటు అతడి అనుచరులు తమను కులం పేరుతో దూషించడమే కాకుండా, చంపేస్తామని బెదిరించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, వెంటనే అరెస్ట్ చేయాలని బాధితుడి కుటుంబం డిమాండ్ చేస్తోంది.






