నూతన సర్పంచుల బాధ్యతల స్వీకరణ వాయిదా.. ఎందుకంటే..?

by Malleboina Mahesh |

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.

నూతన సర్పంచుల బాధ్యతల స్వీకరణ వాయిదా.. ఎందుకంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికలు (Sarpanch Elections) జరుగుతున్న విషయం తెలిసిందే. నేడు మూడో విడత ఎన్నికలు జరుగుతుండగా రాత్రి వరకు ఓట్ల లెక్కింపు ముగిసి.. ఎన్నికలు ముగియనున్నాయి. దీంతో ఈ నెల 20న గెలిచిన సర్పంచ్ ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు ప్రమాణ స్వీకారం చేయడానికి అధికారులు నిర్ణయించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా నూతన సర్పంచుల బాధ్యతల స్వీకరణ వాయిదా వేశారు. తాజా నిర్ణయం ప్రకారం.. ఈ గడువును డిసెంబర్ 22వ తేదీకి మార్చారు. డిసెంబర్ 20న పదవీ బాధ్యతలు చేపట్టాల్సి ఉండగా.. సరైన ముహూర్తాలు లేవని, ఆ రోజు బాధ్యతలు స్వీకరించడం మంచిది కాదని భావించిన పలువురు ప్రజా ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

దీంతో నూతన సర్పంచుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న పంచాయతీ రాజ్ శాఖ, బాధ్యతల స్వీకరణ కార్యక్రమాన్ని రెండు రోజులు వెనక్కి జరిపి డిసెంబర్ 22న నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో అదే రోజున నూతన సర్పంచులు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, నూతన పాలకవర్గాలతో ప్రమాణస్వీకారం చేయించాలని ఉన్నతాధికారులు ఇప్పటికే జిల్లాల కలెక్టర్లకు, పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Next Story