- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు: CM రేవంత్ ప్రకటన
తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు: CM రేవంత్ ప్రకటన

దిశ, వెబ్‌డెస్క్: సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిచారు. హరేకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన కిచెన్ షెడ్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం అక్కడ జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రూ.10,300 కోట్లతో చేపట్టబోయే పనులను ప్రారంభించినట్లు తెలిపారు. అంతర్జాతీయ ఎడ్యుకేషన్ హబ్‌గా కొడంగల్‌ను తీర్చిదిద్దుతా అని అన్నారు. కొడంగల్‌లోని ప్రతీ ఎకరాకు నీరు అందిస్తానని హామీ ఇచ్చారు. ఢిల్లీలోని నోయిడా తరహాలో తెలంగాణకు కొడంగల్ మారబోతోందని అన్నారు. లగచర్లలో కుట్రలు చేసి భూసేకరణను అడ్డుకున్నారని బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. అన్యాయంగా రైతులు కేసుల్లో ఇరుక్కునేలా చేశారని అన్నారు. రెండు, మూడు రోజుల్లో రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల నోటిఫకేషన్ రాబోతోందని తనకు సమాచారం అందింది. ఈ సందర్భంగా ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను.. గ్రామాన్ని అభివృద్ధి చేసే అభ్యర్థులను, యువకులను సర్పంచ్‌లుగా ఎన్నుకోవాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధిని అడ్డుకునే వారికి అవకాశం ఇవ్వొద్దు.. ఎన్నికల్లో గెలిపించొద్దని విజ్ఞప్తి చేశారు. కాగా, సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్, జిల్లా ఎస్పీ స్నేహ మెహర పర్యవేక్షణ చేశారు.






