- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sarpanch Elections: భారీ నజరానా ప్రకటించిన బండి సంజయ్
తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. మంగళవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఈ మేరకు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,728 సర్పంచ్ స్థానాలకు, 1,12,242 వార్డు స్థానాలకు మొత్తం మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు చెప్పారు. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) బంపర్ ఆఫర్ ప్రకటించారు. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే.. ఆ గ్రామాభివృద్ధికోసం ప్రత్యేకంగా రూ.10 లక్షల నిధులను అందజేస్తానని కేంద్ర మంత్రి ప్రకటించారు. తాను ఒక్కసారి మాట ఇస్తే తప్పే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
గ్రామ పంచాయతీ ప్రజలను ఏకం చేసి అభివృద్ధి వైపు దృష్టి సారించేలా ప్రోత్సహించేందుకే ఈ నిధులను ప్రకటించాలని నిర్ణయించినట్లు తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు రూ.5 లక్షల ప్రోత్సాహక నిధులిస్తామని హామీ ఇచ్చి మొండిచేయి చూపింది. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సైతం ఏకగ్రీవం పేరుతో నజరానా ప్రకటించి మోసం చేసింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలకుల మాటలు నమ్మి ఏకగ్రీవం చేసిన పంచాయతీల ప్రజలు ఆర్థికంగా నష్టపోయారు. దయచేసి ఈ ఎన్నికల్లో మరోసారి మోసం చేసేందుకు ఆ రెండు పార్టీలు మళ్లీ ప్రలోభ పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. మాయ మాటలు నమ్మి మోసపోవద్దని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలను కోరుతున్నా అని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. గ్రామాల అభివృద్ధికి నిధులు ఇస్తోంది నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం మాత్రమే అని చెప్పారు.






