- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎటూ తేలని సర్పంచ్ ఎన్నికల ఫలితం.. అధికారులు ఏం చేశారంటే?
by Gantepaka Srikanth |
ఎటూ తేలని సర్పంచ్ ఎన్నికల ఫలితం.. అధికారులు ఏం చేశారంటే?

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సర్పంచ్ ఎన్నికల(Telangana Sarpanch Elections) ఫలితాల్లో ఆసక్తికర ఘటనచోటు చేసుకుంది. కౌంటింగ్‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇద్దరు అభ్యర్థులకు సమానమైన ఓట్లు వచ్చాయి. దీంతో ఎన్నికల సంఘం అధికారులు డ్రా తీశారు. ఈ డ్రాలో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం లక్ష్మక్కపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. కాంగ్రెస్ నుంచి వేముల సురేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి ఇండ్ల రాజయ్య పోటీ చేశారు. ఇద్దరికి చెరో 148 ఓట్లు రావడంతో లక్కీ డ్రా తీయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎట్టకేలకు విజయం సాధించడంతో బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. అంతకుముందు కౌంటింగ్ సమయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు అప్రమత్తంగా ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు.
Next Story






