సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. అధికారిక ఉత్తర్వులు జారీ

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-22 09:02:18  IST  )

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం సర్వం సిద్ధమైంది.

సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. అధికారిక ఉత్తర్వులు జారీ
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం సర్వం సిద్ధమైంది. డెడికేటెడ్‌ కమిషన్ ఇచ్చిన నివేదికకు తెలంగాణ కేబినెట్ (Telangana Cabinet) ఆమోదం తెలుపడంతో సర్పంచ్ (Sarpanch), వార్డు మెంబర్ల (Ward Members) రిజర్వేషన్లకు విధివిధానాలను ఖరారు చేస్తూ ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు (CS K Rama Krishna Rao) జీవో నెం.46ను విడుదల చేశారు. అయితే, దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాల మేరకు రిజర్వేషన్లు 50 శాతం మించకుండా ఈ మార్గదర్శకాలు జారీ అయ్యాయి.

అయితే, ప్రస్తుతం ఇచ్చిన జీవోకు అనుగుణంగా ఎంపీడీవోలు వార్డులకు, ఆర్డీవోలు సర్పంచి పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. రాజకీయ పార్టీల సమక్షంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు రొటేషన్ పద్ధతిలో సీట్లును కేటాయిస్తారు. రేపు, ఎల్లుండి జిల్లాల యంత్రాంగం రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేస్తారు. రిజర్వేషన్ల కేటాయింపు తర్వాత పంచాయతీ ఎన్నికలకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం లేఖ రాయనుంది. స్థానిక ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఈ నెల 24న రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసి, విచారణ ముగించాలని కోరనుంది. హైకోర్టు (High Court) ఇచ్చే ఉత్తర్వుల ప్రకారం అదే రోజు లేక మరుసటి రోజు స్థానిక ఎన్నికల షెడ్యూలు విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సంసిద్ధంగా ఉంది.

Next Story