- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking News : రంజాన్ పండగ నేపథ్యంలో సర్కార్ కీలక నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది. రంజాన్(Ramzan) నేపథ్యంలో ఇది వరకే ముస్లింలకు సమయపాలనలో వెసులుబాటు కల్పించగా.. ఇపుడు మరో ముఖ్య నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 2 నుంచి 31 వరకు షాపులను 24 గంటలు(24hrs Shops Open) తెరిచేందుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. మేరకు రాష్ట్ర కార్మికశాఖ ముఖ్య కార్యదర్శి సంజయ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా సిబ్బంది ఎవరైనా రోజూకు 8 గంటలకు మించి, వారానికి 48 గంటలు మించి పని చేస్తే యజమానులు రెట్టింపు వేతనాలు ఇవ్వాల్సిందేనని ఉత్తర్వుల్లో పేర్కొంది. అదే విధంగా సెలవు దినాల్లో పనిచేస్తే ప్రత్యామ్నాయ లీవ్ ఇవ్వాలని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. కాగా రంజాన్ మాసం సందర్భంగా ఏర్పాట్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మసీదులు, ఈద్గాల వద్ద నీటి వసతి, కరెంటు సౌకర్యం, వాష్ రూమ్స్ సదుపాయాలు కల్పించాలని అధికారులకు తెలియజేసింది. కాగా రంజాన్ నెల పూర్తయ్యే వరకు ముస్లిం ఉద్యోగులు సాయంత్రం 4 గంటలకే ఇళ్లకు వెళ్లిపోయేలా వెసులుబాటు కల్పిస్తూ ఇదివరకే ఆదేశాలు జారీ చేసింది సర్కార్.






