- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్టీసీ తొలి మహిళా డ్రైవర్‌గా సరిత.. సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ విషెస్
చరిత్రలో ఫస్ట్ టైమ్ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)లో తొలి మహిళా బస్ డ్రైవర్ (First female bus driver)గా వాంకుడోతు సరిత నియమితులయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: చరిత్రలో ఫస్ట్ టైమ్ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)లో తొలి మహిళా బస్ డ్రైవర్ (First female bus driver)గా వాంకుడోతు సరిత నియమితులయ్యారు. తొలిరోజు విధుల్లో భాగంగా ఆమె హైదరాబాద్ నుంచి మిర్యాలగూడకు బస్సు నడిపారు. ఈ నేపథ్యంలో సరిత పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. తాజాగా ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్‌గా చేరిన వాంకుడోతు సరితకు సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘X’ వేదికగా స్పెషల్ విషెస్ చెప్పారు. అవకాశాలు వస్తే మహిళలు ఏ రంగంలోనైనా రాణించగలరని, ఆత్మవిశ్వాసంతో ముందుడుగు వేసిన సరితకు ఆయన అభినందనలు తెలియజేశారు.
ప్రస్తుతం ఆర్టీసీ బస్సులకు మహిళలనే యజమానులుగా చేస్తున్న సందర్భంలో.. మహిళా డ్రైవర్ నియామకం ఒక కీలక ముందడుగు అని పేర్కొన్నారు. మహిళలు విద్య, విజ్ఞానం, వృత్తి, వ్యాపారం, క్రీడలు, సైన్యం వంటి అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుతున్నారని తెలిపారు. గృహ బాధ్యతలు, సమాజ నిర్మాణంలోనూ మహిళల పాత్ర అపూర్వమైనదని అన్నారు. ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ, అడ్డంకులను అధిగమించి మహిళలు విజయాల బాటలో ముందుకెళ్తున్నారని, సరిత అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని అభినందించారు. ‘ఇందిరా మహిళా శక్తి’ పథకం ద్వారా రాష్ట్రంలోని స్వయం సహాయక బృందాలకు సాధికారత కల్పించేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలు ప్రారంభించిందని గుర్తు చేశారు. కోటి మందిని కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్య సాధన కోసం ప్రతి మహిళా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.






