- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓట్ల కోసం గ్రామంలో చీరల పంపిణీ.. అడ్డంగా దొరికిపోయిన అభ్యర్థి
by Ajay Maddhiboyina |
పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు అభ్యర్థులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. చాలా గ్రామాల్లో డబ్బలు,

X
దిశ, వెబ్ డెస్క్: పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు అభ్యర్థులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. చాలా గ్రామాల్లో డబ్బలు, మద్యంతో పాటు మాసం కూడా పంచుతూ ఓటర్లకు ఎర వేస్తున్నారు. ఇక తాజాగా వనపర్తి జిల్లా పాన్ గల్ మండల కేంద్రంలోనూ అలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు బీఆర్ఎస్ నేత రమేష్ రెడ్డి నివాసం వద్ద చీరలు పంపిణీ చేశారు.
చీరలు పంచుతున్న సమయంలో అక్కడకు కాంగ్రెస్ నాయకులు చేరుకుని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ నేత ఇంటివద్ద దాదాపు 5వేల చీరలు ఉన్నాయని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ చీరలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం చీరల పంపిణీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Next Story






