తెలంగాణ వీరత్వానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ : Minister Srinivas Goud

by Bhoopathi Nagaiah |   (  Updated:2022-12-26 13:54:44  IST  )

తెలంగాణ వీరత్వానికి, పరాక్రమానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రతీక అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

తెలంగాణ వీరత్వానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ : Minister Srinivas Goud
X

దిశ, కొల్లాపూర్ : తెలంగాణ వీరత్వానికి, పరాక్రమానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రతీక అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం పెద్దకొత్తపల్లిలో ఏర్పాటు చేసిన బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డితో కలిసి ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. సబ్బండ వర్గాలకు ఆత్మగౌరవ స్ఫూర్తిగా నిలిచి, ఆనాటి సమాజంలో నెలకొన్న నిరంకుశ రాజరిక పోకడలకు వ్యతిరేకంగా సబ్బండ వర్గాలను ఏకం చేసి, పాపన్న పోరాడిన తీరు గొప్పదని అన్నారు. సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ బడుగు బలహీన వర్గాల నాయకత్వాన్ని సముచితంగా గౌరవించుకుంటున్నదని కొనియాడారు. అణచివేత, వివక్షకు వ్యతిరేకంగా పాపన్న గౌడ్ ప్రదర్శించిన ఆత్మగౌరవ పోరాట స్ఫూర్తిని తెలంగాణ రాష్ట్రం కొనసాగిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,అధికారులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Next Story