- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాళేశ్వరం ఒక్క చోటనే సరస్వతీ నది పుష్కరాలు! ఏర్పాట్లపై మంత్రుల రివ్యూ మీటింగ్
భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని సరస్వతీ నది పుష్కరాలపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేషీలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని (Saraswati River Pushkaralu) సరస్వతీ నది పుష్కరాలపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) పేషీలో సమీక్ష సమావేశం నిర్వహించారు. మే 15 నుంచి 26 వరకు జరిగే సరస్వతీ నది పుష్కరాలపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Minister Duddilla Sridhar Babu) సారథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లోని మంత్రి సురేఖ కార్యాలయంలో దేవాదాయ, పంచాయతీరాజ్, ఆర్టీసీ, ఆర్ అండ్ బీ, ట్రాన్స్ పోర్టు తదితర శాఖ ఉన్నతాధికారులు, ఇంజినీరింగ్ విభాగ హెడ్‌లతో సుదీర్ఘ సమీక్ష జరిగింది.
పుష్కరాలకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్ధం ఏర్పాట్లు, శాశ్వత, తాత్కాలిక ఏర్పాట్లపై చర్చ జరిగింది. కాళేశ్వరం (Kaleshwaram) ఒక్క చోటనే సరస్వతీ నదికి పుష్కరాలు జరుగుతుండడంతో అన్ని రాష్ట్రాల నుంచి రోజుకు లక్షన్నరకుపైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని మంత్రులు సురేఖ, శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు అధికారులు చేసిన ఏర్పాట్లపై చర్చలు జరిపారు.
ఈ సమావేశంలో రాష్ట్ర సీఎస్ రామకృష్ణరావు, డీజీపీ జితేందర్, డీజీ ఇంటెలిజెన్స్ శివధర్ రెడ్డి, సంగీత్ నాటక్ అకాడమీ చైర్మన్ అలేఖ్య పుంజాల, దేవాదాయ శాఖ ప్రిన్స్ పల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, ఆర్ అండ్ బీ, ట్రాన్స్పోర్ట్ ప్రిన్స్ పల్ సెక్రటరీ వికాస్ రాజ్, పంచాయతీ రాజ్ ప్రిన్సిపాల్ సెక్రటరీ లోకేశ్ కుమార్, సింగరేణి సీఎండీ బల్ రామ్, సీఈఓ సేర్ఫ్ దివ్యా దేవరాజన్, ఏవియేషన్ డైరెక్టర్ భరత్ రెడ్డి, ఎండోమెంట్ కమిషనర్ వెంకటరావు, అడిషనల్ కమిషనర్ కృష్ణవేణి, భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఇతర శాఖల ఉన్నతాధికారులు, ఆలయ ఈఓ మహేశ్, ఆలయ ప్రధాన, ఉపప్రధాన అర్చకులు పాల్గొన్నారు.






