- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సరస్వతి పుష్కరాల పనుల్లో స్లో ఏంటి..త్వరతగతిన పూర్తి చేయాలని మంత్రి ఆగ్రహం
సరస్వతి పుష్కరాలు ప్రారంభానికి ఇంకా మూడు రోజులే మిగిలి ఉంది అభివృద్ధి పనుల్లో ఇంత స్లో ఏంటి అంటూ అధికారులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రశ్నించారు.

దిశ, మల్హర్(కాళేశ్వరం): సరస్వతి పుష్కరాలు ప్రారంభానికి ఇంకా మూడు రోజులే మిగిలి ఉంది అభివృద్ధి పనుల్లో ఇంత స్లో ఏంటి అంటూ అధికారులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రశ్నించారు. ఆదివారం కాలేశ్వరంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై మంత్రి సమీక్షించేందుకు వచ్చిన సందర్భంగా ఎక్కడి పనులు అక్కడే ఇంకా జరుగుతుండడంతో అవాక్కయ్యాడు సమయం ఆసన్నమైందని త్వరతగాతిన పూర్తి చేయాలని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సరస్వతి పుష్కరాల సందర్భంగా చేపడుతున్న అభివృద్ధి పనులు విఐపి ఘాట్, సరస్వతి మాతా విగ్రహం, జ్ఞానతీర్థం, నదిలో భక్తుల స్నానమాచరించు ప్రదేశం, టెంట్ సిటీ తదితర అంశాలను పరిశీలించి నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం టెంట్ సిటీలో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి రాష్ట్ర ముఖ్యమంత్రి రాక సందర్భంగా బందోబస్తు, పనులు పూర్తి చేయు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పనులు చాలా స్లోగా జరుగుతుండడం మీరే బాధ్యులవుతారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పట్టణం మొత్తాన్ని విద్యుద్దీకరణతో ముస్తాబు చేయాలని, 12 రోజులు పండుగ వాతావరణంల రంగురంగులతో విరజిల్లేలా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సరస్వతి మాత విగ్రహాన్ని పూలతో అందంగా అలంకరించాలని తెలుపుతూ పిండ ప్రధాన భవనం అసంపూర్తిగా ఉందని దేవాదాయ ఇంజినీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులు హారతి కార్యక్రమాన్ని వీక్షించేందుకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తులు నదిలోకి స్నానాలకు వెళ్ళడానికి తాత్కాలిక రహదారి ఏర్పాటుతో పాటు క్వియర్ మాట్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భక్తులు నదిలోకి వెళ్లకుండా వెళ్లకుండా బారికేడ్స్, ప్రమాద హెచ్చరికల బోర్డ్స్ ఏర్పాటు చేయాలన్నారు.
నదిలో 50 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచడంతో పాటు నాటుపడవలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. పుష్కరాలు సందర్భంగా మొట్టమొదటిసారిగా కాలేశ్వరంలో టెంట్ సిటి ఏర్పాటు చేస్తున్నామని కార్యక్రమాలు సజావుగా, సక్రమంగా పకడ్బందీగా జరిగేందుకు మినిట్ టు మినిట్ కార్యక్రమం తయారు చేయాలని సూచించారు. హారతి కార్యక్రమం పర్యవేక్షణకు దేవాదాశాఖ నుండి ప్రత్యేక అధికారులను నియమించాలని సూచిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించే ఈ పుష్కరాలకు తదుపరి రోజుల్లో రాష్ట్ర గవర్నర్, ఇతర మంత్రులు వచ్చే ఆవకాశం ఉన్నందున పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు. మహదేవ పూర్ నుండి వీధిదీపాలు ఏర్పాటుతో పాటు డివైడర్లు మధ్యలో స్ట్రిప్ లైట్లు ఏర్పాటు చేయాలని స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ కు సూచించారు.రహదారులకు మరమ్మత్తులు నిర్వహించాలని ఎక్కడ గుంతలు ఉండొద్దని ఆర్ అండ్ బి, జాతీయ రహదారుల అధికారులను ఆదేశించారు. తాత్కాలిక బస్టాండ్ వద్ద తాత్కాలిక లైటింగ్, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు.పారిశుద్ధ్యం చాలా ముఖ్యమని పట్టణం మొత్తం పరిశుభ్రంగా ఉండాలని, పరిశుభ్రత పాటించేందుకు ప్రతి 30 నిమిషాలకోసారి పరిశుభ్రం చేసే విధంగా పర్యవేక్షకులను నియమించాలని ఆదేశించారు. పనులు పర్యవేక్షణకు నియమించిన నోడల్ అధికారులు పూర్తి బాధ్యతలు తీసుకొని జరిగే పనులలో నిమగ్నమై నాణ్యత పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ నాణ్యత పాటించని కాంట్రాక్టర్లపై చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. ప్రత్యేక అధికారులు స్థానికంగా ఉండి పనులు పర్యవేక్షణ చేయాలని, ఒక్క నిమిషం కూడా కరెంటు పోవద్దని కాటారం, బీరసాగర్ నుండి విద్యుత్ సరఫరా తీసుకోవాలని తెలుపుతూ విద్యుత్ అంతరాయం ఏర్పడితే తదుపరి చర్యలకు మీరే బాధ్యులవుతారని పేర్కొన్నారు. ఆరు జనరేటర్ 125 కేవీ జనరేటర్లు అందుబాటులో ఉంచుకోవాలని. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని సూచించారు. దేవాలయం, 100 గదుల సత్రంలో జనరేటర్లు ఏర్పాటు చేయాలని దేవాదాయశాఖ అధికారులను ఆదేశించారు.
భక్తులకు ప్రతి రోజు అన్నదానం చేయాలని మంత్రి స్పష్టం చేశారు. భక్తులు నదిలోకి వెళ్ళు సందర్భంలో ఎండకు కాళ్లు కాలకుండా మ్యాట్స్ ఏర్పాటు చేయాలన్నారు. రంగులు వేసేందుకు ప్రత్యేకంగా జె ఎన్ టి యు నుంచి సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పట్టణం మొత్తం విద్యుత్తు దీపాలతో సుందరీకరణ చేయాలని,పండుగ వాతావరణంల ఉండాలని పేర్కొన్నారు. మెయిన్ ఘాట్ వద్ద ఆర్చి స్లాబు చేయడం పట్ల దేవాదాయ ఇంజినీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పని అయిపోయిందని చెప్పడం కరెక్ట్ కాదని మండిపడ్డారు. పుష్కరాలు దగ్గర పడుతున్న సమయంలో స్లాబు ఎందుకు చేశారని ప్రశ్నిస్తూ స్లాబ్ చేయకుండా ఉండాల్సిందని భక్తులు నదిలోకి ఎలా వెళ్తారని అసంతృప్తి వ్యక్తం చేశారు. రవాణా సౌకర్యం కల్పనకు క్యాబ్స్ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్లాన్ ప్రక్కగా తయారు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ వెంకటరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే, రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్ రెడ్డి, దేవాదాయ శాఖ ఆర్జెసి రామకృష్ణారావు,అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్,విజయలక్ష్మి,కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్,ఇరిగేషన్,పంచాయతీరాజ్, ఆర్ డబ్ల్యూఎస్,వైద్య,ఆర్ అండ్ బి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.






