Telangana: నేటి నుంచి సరస్వతి నది పుష్కరాలు

by velandi.Saikiran |

తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్రజలకు అలర్ట్. ఇవాల్టి నుంచి తెలంగాణ రాష్ట్రంలో సరస్వతి నది పుష్కరాలు ( Saraswati

Telangana: నేటి నుంచి సరస్వతి నది పుష్కరాలు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్రజలకు అలర్ట్. ఇవాల్టి నుంచి తెలంగాణ రాష్ట్రంలో సరస్వతి నది పుష్కరాలు ( Saraswati Pushkaralu 2025) ప్రారంభం కాబోతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఈ సరస్వతి నది పుష్కరాలు జరుగుతాయి. ఈ జిల్లాలోని మహాదేవపూర్ కాలేశ్వరం త్రివేణి సంగమం వద్ద అంతర్వాహిని సరస్వతి నది పుష్కరాలు జరగనున్నాయి.

ఇవాల్టి నుంచి.. ఈ పుష్కరాలు ఈనెల 26వ తేదీ వరకు జరుగుతాయి. 12 సంవత్సరాలకు ఒకసారి వస్తున్న ఈ పుష్కరాలను... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా గ్రాండ్ గా నిర్వహిస్తోంది. ఇవాళ ఉదయం ప్రత్యేక పూజలతో ఈ పుష్కరాలను ప్రారంభించారు. ఇక ఇవాళ సాయంత్రం 4:30 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు... కాలేశ్వరం చేరుకొని పుష్కర స్నానం కూడా ఆచరిస్తారు.

సీఎం రేవంత్ రెడ్డి దంపతులు వస్తున్న నేపథ్యంలో అక్కడ పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి కాళేశ్వరానికి బస్సులు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. 12 సంవత్సరాల తర్వాత పుష్కరాలు వస్తున్న నేపథ్యంలో జనాల తాకిడి ఎక్కువగా ఉండే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Next Story