షాకింగ్..పూర్ణ చందర్ కన్ఫషన్ స్టేట్మెంట్‌లో బీఆర్ఎస్ మాజీ ఎంపీ పేరు?

by Ajay Maddhiboyina |

స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్ణచందర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి నేడు జడ్జి ముందు హాజరు పరిచారు.

షాకింగ్..పూర్ణ చందర్ కన్ఫషన్ స్టేట్మెంట్‌లో బీఆర్ఎస్ మాజీ ఎంపీ పేరు?
X

దిశ‌, వెబ్ డెస్క్: స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్ణచందర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి నేడు జడ్జి ముందు హాజరు పరిచారు. ఈ కేసులో ఆయనకు 14రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో చంచల్ గూడ జైలుకు తరలించారు. కాగా పూర్ణచందర్ కన్ఫషన్ స్టేట్మెంట్‌లో సంచలన విషయాలు చెప్పినట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. స్టేట్మెంట్‌లో జోగినిపల్లి సంతోష్ రావు పేరును ప్రస్తావించినట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. తనకు సంబంధించిన అన్ని విషయాలు సంతోష్ రావుకు తెలుసని చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది.

తాను స్వేచ్ఛతో రిలేషన్‌షిప్‌లో ఉన్న విషయం కూడా ఆయనకు తెలుసని చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. పెళ్లి చేసుకుంటాను, భర్తతో విడాకులు తీసుకో అని పూర్ణచందర్ స్వేచ్ఛకు చెప్పినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే స్వేచ్ఛ పూర్ణ చందర్ మాటలు నమ్మి భర్తకు విడాకులు ఇచ్చినట్టు తెలుస్తోంది. వారం రోజుల క్రితమే పూర్ణ చందర్, స్వేచ్ఛ కలిసి అరుణాచలం వెళ్లి వచ్చినట్టు పోలీసుల విచారణలో తెలిసింది. అరుణాచలం నుండి తిరిగి వస్తున్న సమయంలోనే పెళ్లి విషయంపై మరోసారి ఇద్దరి మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తోంది. నన్ను ఏం చేయలేవు..నాకు రాజకీయ అండదండలు ఉన్నాయని పూర్ణచందర్ బెదిరింపులకు సైతం పాల్పడినట్టు తెలుస్తోంది. అరుణాచలం నుండి వచ్చిన మూడు రోజులకే స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకుంది.

Next Story