- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Manchu Family: మంచు మోహన్ బాబు ఇంట్లో సంక్రాంతి సంబురాలు.. ఆ ఇద్దరు మిస్..!
తెలుగు రాష్ట్రాల్లో భోగి(Bhogi) పండగను ఘనంగా నిర్వహిస్తున్నారు. పిల్లలు, పెద్దలు ఉదయాన్నే వీధుల్లో భోగి మంటలు వేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో భోగి(Bhogi) పండగను ఘనంగా నిర్వహిస్తున్నారు. పిల్లలు, పెద్దలు ఉదయాన్నే వీధుల్లో భోగి మంటలు వేశారు. మహిళలు రంగులతో ఇంటి ఎదుట రకరకాల ముగ్గులు వేశారు. మరికొందరు ఉదయాన్నే భక్తులు ఆలయాలకు తరలివెళ్లి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. సంక్రాంతి కోసం నగరవాసులు స్వగ్రామాలకు రావడంతో సందడి నెలకొంది. హరిదాసులతో పాటు అలంకరించిన బసవన్నలు ఇంటింటికీ వెళ్తున్నాయి. ఇదిలా ఉండగా.. మంచు మోహన్ బాబు(Manchu Mohan Babu)లో కుటుంబంలో సంక్రాంతి సంబురాలు అంబరాన్ని అంటాయి.
కుటుంబం మొత్తం ఒకేచోట చేరి ఘనంగా జరుపుకున్నారు. అయితే, ఇందులో మంచు మనోజ్(Manchu Manoj), ఆయన భార్యా పిల్లలు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జరిగిన గొడవల కారణంగా మనోజ్ ఇంట్లోంటి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. భార్యా పిల్లలతో కలిసి మనోజ్ మరోచోట పండుగ జరుపుకున్న ఫొటోలు నెట్టింట పోస్టు చేయగా అవి కాస్త వైరల్‌గా మారాయి. మరోవైపు వైజాగ్‌లో జరుగుతోన్న సంక్రాంతి వేడుకల్లో సినీ నటుడు సాయికుమార్ కుటుంబసమేతంగా పాల్గొన్నారు.






