- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంక్రాంతికి ఊరెళ్లే వారికి అలర్ట్.. హైదరాబాద్ పోలీసుల కీలక సూచనలు
సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ లో ఉన్న సెటిలర్లు, ఏపీకి చెందిన వారితో పాటు తెలంగాణలోని వివిధ గ్రామాలు, పట్టణాలకు చెందిన ప్రజలకు తమ స్వగ్రామాలకు వెళ్తుంటారు.

దిశ, వెబ్ డెస్క్: సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ లో ఉన్న సెటిలర్లు, ఏపీకి చెందిన వారితో పాటు తెలంగాణలోని వివిధ గ్రామాలు, పట్టణాలకు చెందిన ప్రజలకు తమ స్వగ్రామాలకు వెళ్తుంటారు. తాజాగా ఇలా వెళ్లే కుటుంబాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇళ్లకు తాళాలు వేసి వెళ్లే వారు ముందస్తు జాగ్రత్తగా తమ పరిధిలోని సమీప పోలీస్ స్టేషన్, బీట్ ఆఫీసర్‌కు సమాచారం అందించాలని పోలీస్ కమిషనర్ కోరారు. ఇలా సమాచారం ఇవ్వడం వల్ల పోలీసులు తమ రెగ్యులర్ పెట్రోలింగ్‌లో ఆయా ఇళ్లపై ప్రత్యేక నిఘా ఉంచుతారని హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ తెలిపారు. అలాగే నేరాల నియంత్రణలో ప్రజల సహకారం ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు.
అదే సమయంలో, ప్రయాణాలు చేసేటప్పుడు ఇళ్లలో నగదు, బంగారం, ఇతర విలువైన వస్తువులను ఉంచవద్దని పోలీసులు గట్టిగా సూచించారు. వాటిని బ్యాంకు లాకర్లు, ఇతర సురక్షితమైన ప్రదేశాల్లో భద్రపరుచుకోవాలని కోరారు. ఈ చిన్నపాటి జాగ్రత్తలు దొంగతనాల నివారణకు తోడ్పడతాయని, తద్వారా పండుగను ప్రశాంతంగా జరుపుకోవచ్చని కమిషనర్ తెలిపారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే తక్షణమే డైల్ 100కు కాల్ చేయాలని, ప్రజల ఆస్తిపాస్తుల రక్షణకు హైదరాబాద్ పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని సీపీ సజ్జనార్ తన ఎక్స్ పోస్టులో పునరుద్ఘాటించారు.






