- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ తదుపరి సీఎస్‌గా సంజయ్ జాజు? రాష్ట్ర విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
తెలంగాణ తదుపరి సీఎస్‌గా సీనియర్ ఐఏఎస్ సంజయ్ జాజు పేరు దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర సర్వీసుల్లో డెప్యుటేషన్‌పై కొనసాగుతున్న సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు (Sanjay Jaju)ను తిరిగి సొంత కేడర్‌కు పంపాలంటూ తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.
ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ‘మినిస్ట్రీ ఆఫ్ డెవలప్‌మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్’ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న సంజయ్ జాజును, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు తక్షణమే పేరెంట్ కేడర్‌కు బదిలీ చేస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణా వ్యవహారాల శాఖ (DoPT) డైరెక్టర్ అన్నీస్ కన్మణి జాయ్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో తెలంగాణ కొత్త సీఎస్‌గా 1992 బ్యాచ్‌కు చెందిన సంజయ్ జాజు పేరు దాదాపుగా ఖరారైనట్లుగా సచివాలయ వర్గాల సమాచారం. ప్రస్తుత సీఎస్ కే. రామకృష్ణారావు పదవీ కాలం ఈనెల 30వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే, రాబోయే ఒకటి రెండు రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం నుంచి కొత్త సీఎస్ నియామకానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.






