- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆపరేషన్ సిందూర్‌పై సానియా మీర్జా సంచలన పోస్ట్.. ఆ ఇద్దరి ఫొటోలతో..
ఇద్దరు మహిళా అధికారులు కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ‘ఆపరేషన్ సిందూర్’ అమలు చేసిన విధానంపై మీడియాకు వివరించిన విషయం తెలిసిందే.

ఇద్దరు మహిళా అధికారులు కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ‘ఆపరేషన్ సిందూర్’ అమలు చేసిన విధానంపై మీడియాకు వివరించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ అధికారులపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ సిందూర్‌పై భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా స్పందించారు. ఈ మేరకు తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక స్టోరీ పోస్ట్ చేశారు. ఆ ఇద్దరి ఫొటోలనే పోస్ట్ చేసి కీలక కామెంట్స్ చేసింది. సానియా మీర్జా చేసిన పోస్ట్ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ లింక్ ఓపెన్ చేయాల్సిందే.
ముంబై నటి జెత్వానీ కేసులో కీలకంగా వ్యవహరించిన ఐపీఎస్ అధికారులు కాంతిరాణా టాటా, విశాల్ గున్నీలకు హైకోర్టులో ఊరట లభించింది. మే 5న విచారణకు రావాలని వారికి సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో వారు విచారణకు గైర్హాజరై హైకోర్టును ఆశ్రయించారు. ఐపీఎస్ అధికారులకు బెయిల్ ఇవ్వవద్దని, వారిని కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాల్సిన అవసరం ఉందని సీఐడీ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ఈ కేసుపై పూర్తి వివరాల కోసం ఈ లింక్ ఓపెన్ చేయండి.
తెలంగాణ సచివాలయంలో ఇంటర్‌నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. గత ఐదు రోజులుగా ఇంటర్నెట్ సరిగ్గా రావడం లేదని పలు విభాగాలకు చెందిన సిబ్బంది చెబుతున్నారు. మీడియా పాయింట్ ఐఅండ్‌పీఆర్, సెక్రటేరియట్ ఎంట్రీ పాసుల జారీ, విదేశాలకు వెళ్లే వారిని ధృవీకరించే ఈ మూడు విభాగాల్లో తీవ్ర అంతరాయం కలగడంతో అధికారులు మాన్యువల్‌గా సచివాలయం పాసులు జారీ చేస్తున్నారు. ఇంతకు సెక్రటేరియట్‌కు ఎందుకు ఇంటర్ నెట్ కనెక్షన్ ఆగిపోయిందో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.
ఏపీ లిక్కర్‌స్కాం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. విజయవాడ వెటర్నరీ కాలనీలో ఉన్న నిందితులు ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్నివాసాల్లో ఉదయం 10.30 గంటల నుంచి సిట్అధికారులు తనిఖీలు చేస్తున్నారు. జగన్వ్యక్తిగత సహాయ కార్యదర్శి కేఎన్ఆర్నివాసంలోనూ సోదాలు చేస్తున్నారు. మరోవైపు ఏపీ మద్యం కుంభకోణంలో కేసులో నిందితులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కృష్ణమోహన్‌రెడ్డి, ధనుంజరరెడ్డి, బాలాజీ గోవిందప్పకు మధ్యంతర ఉపశమనానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసులో కీలక అప్ డేట్ కోసం ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.






