పాశమైలారం ఘటన.. పెరిగిన మృతుల సంఖ్య, మరో ముగ్గురి ఆచూకీ గుర్తింపు

by Naga Rani Yarlagadda |

సంగారెడ్డి జిల్లా పాశమైలారం (Pashamylaram) పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదంలో మరికొన్ని మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

పాశమైలారం ఘటన.. పెరిగిన మృతుల సంఖ్య, మరో ముగ్గురి ఆచూకీ గుర్తింపు
X

దిశ, వెబ్‌డెస్క్: సంగారెడ్డి జిల్లా పాశమైలారం (Pashamylaram) పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో బ్లాస్ట్‌లో మరికొన్ని మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. మంగళవారం వెలుగు చూసిన వివరాల ప్రకారం.. తాజగా గుర్తించిన మృతుల్లో ఇద్దరు బిహార్‌కు, ఒకరు ఒడిశాకు చెందిన కార్మికులుగా తేలింది. ఇప్పటి వరకు మొత్తం 36 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. బిహార్‌ నుంచి పలువురు ప్రజాప్రతినిధులు ప్రమాద స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించారు. సహాయ కేంద్రం వద్ద బిహార్ ఎంపీతో పాటు ఇతర నాయకులు బాధిత కుటుంబాలతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు.

మరోవైపు సిగాచి కంపెనీ వద్ద ఆరోరోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, భారీ యంత్రాలతో సహా హైడ్రా సిబ్బంది శిథిలాలను తొలగిస్తున్నారు. ఇదిలా ఉండగా... పేలుడులో గాయపడి ధ్రువ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మున్మున్ చౌధరి మృతిచెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 40కి పెరిగింది. ఈ ఘటన పరిశ్రమలో భద్రతా లోపాలపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండటంతో రక్షణ చర్యలు మరింత జాగ్రత్తగా కొనసాగుతున్నాయి.

Next Story